Guppedantha Manasu: నేటి ఎపిసోడ్ లో మను తండ్రి ఎవరో తెలిసిపోయింది..

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: నేటి ఎపిసోడ్ లో మను తండ్రి ఎవరో తెలిసిపోయింది..
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘మీరు మనుకి తండ్రి అని చెప్పేశారు.. దాని తర్వాత ఎన్ని సమస్యలు వస్తాయో.. మీరు ఊహించారా మామయ్యా.. ఆ దేవయాని మేడమ్ ఇప్పటికే ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతుంది. మీరు తప్పు చేసే వాళ్ళు కాదని తెలిసిన ఆవిడ అలా మాట్లాడుతున్నారు. ఆవిడే కాదు.. ఆవిడ లాగే చాలామంది అలాగే మాట్లాడతారు..అందరికి ఎలా సమాధానం చెప్తారు? అని అడుగుతుంది. ఏమి చెప్పాలమ్మా.. ‘అలా చెప్పాల్సి వచ్చిందమ్మా..నేను ఏదో కోపంలో తీసుకున్నది కాదు.. చాలా ఆలోచించే ఇలా చేశాను. ఒకప్పుడు మీ అత్త జగతి కూడా ఇదే పరిస్థితిలో ఉంది.. అప్పుడు కూడా ఇలా చెప్పాను. ఇలాగే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత అందరు అర్ధం చేసుకున్నారు.

ఇప్పుడు మను, అనుపమలను తప్పు చేసినట్లు చూస్తుంటే.. నేను భరించలేకపోయాను. మనుకి తన తండ్రి ఎవరో, అనుపమకు భర్త ఎవరో తెలియక ఇద్దరూ కష్టాల్లో పడ్డారు. అందుకే ఇలా చెప్పాను. ఇది నిజం కాకపోవచ్చు, కానీ నేను నమ్ముతాను. అప్పుడు అంతా పరిస్థితి మారిపోతుంది. స్నేహితురాలిగా అనుపమకు సాయం చేశా.. ప్రపంచం ఏమనుకుంటున్నా పర్వాలేదు అని మహేంద్ర అంటాడు. “లేదు మామయ్యా, వాళ్ళ సమస్యలు తీర్చడానికి కాదు, వాళ్ళకి పెద్ద సమస్యను తీసుకొచ్చారు, అనుపమ మేడమ్, దీన్ని ఎలా తీసుకుంటారు, మను గారు ఎలా రియాక్ట్ అవుతారని వసుధార అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.


Next Story