Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..

by Anjali |
Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
X

దిశ, సినిమా: సూపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం గుంటూరు కారం. అయితే మేకర్స్ రేపు (జనవరి 6) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్విటర్‌లో ప్రకటించింది. ఈవెంట్‌కు కొత్త తేదీ, ఈవెంట్ జరిగే ప్లేస్‌ను త్వరలోనే మళ్లీ ప్రకటిస్తామని తెలిపింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్నఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇక యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Next Story

Most Viewed