ఆయన వల్లే సినిమాల్లో అవకాశం: Faria Abdullah

by Disha Web Desk 17 |
ఆయన వల్లే సినిమాల్లో అవకాశం: Faria Abdullah
X

దిశ, సినిమా: 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా 'లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇందులో భాగంగా హీరో సంతోష్ తో కలిసి ఓ టాక్ షోకు హాజరైంది ఫరియా.

అక్కడ తన కెరీర్ అవకాశాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది. 'సినిమా రంగంలో ఎలా అవకాశం వచ్చింది?' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మా కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడాను. నాగ్ సార్ నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశాను. ఈ క్రమంలోనే ఆడిషన్స్ ఇవ్వగా 'జాతిరత్నాలు' సినిమాలో అవకాశం వచ్చింది' అని తెలిపింది.

Next Story

Most Viewed