Samantha : సమంత గురించి సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్

by Dishafeatures1 |
Samantha : సమంత గురించి సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్
X

దిశ, సినిమా: ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంది సమంత. అయిన ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నలేని అభిమానులను సంపాదించుకుంటుంది. దాదాపు 33 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారంటే సామ్‌ను రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది.

ఏంటంటే.. ఇటీవల సమంత ఓ ఫుడ్‌కు సంబంధించి వీడియో చేసింది. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంది. ‘హెల్త్ పాడ్‌క్యాస్ట్’ సిరీస్‌లో పాడ్‌క్యాస్ట్ అండర్‌స్టాడింగ్ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియోపై ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ది లివర్’ డాక్టర్ అనే వ్యక్తి సమంత పోడ్‌కాస్ట్‌పై చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదు. అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

For The Tweet


Next Story