విడాకులు తీసుకున్న బుల్లితెర జంట.. మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడమే కారణమా?

by Disha Web Desk 6 |
విడాకులు తీసుకున్న బుల్లితెర జంట.. మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడమే కారణమా?
X

దిశ, సినిమా: బుల్లితెర జంట ప్రియతమ్ చరణ్-మానస అందరికీ సుపరిచితమే. వీరిద్దరు పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా ప్రియతమ్, మానస విడాకులు తీసుకుని విడిపోయారంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రియతమ్ తన సోషల్ మీడియా ద్వారా కొడుకులను తలుచుకుని ఏడుస్తున్న వీడియో షేర్ చేశాడు. దీంతో వీరిద్దరూ డైవర్స్ తీసుకుని విడిగా ఉంటున్నారనే ప్రచారం జోరందుకుంది. అదే విధంగా మానస కూడా తన కొడుకులతో ఎంజాయ్ చేస్తూ పలు వ్లాగ్స్ చేస్తుంది. వీటిల్లో ఎక్కడా ప్రియతమ్ కనిపించకపోవడంతో విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా, మానస- ప్రియతమ్ విడాకులు కారణం ఇదేనంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ప్రియతమ్ ఒకానొక సమయంలో ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడట. ఈ విషయం మానసకు తెలియడంతో దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే వీరిద్దరి ప్రేమ పెళ్లి కాస్త విడాకులకు దారి తీసినట్లు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొందరు ఇవన్నీ కొట్టిపారేస్తూ వాటిలో నిజం లేదని.. ప్రియతమ్-మానస మధ్య మనస్పర్థలు వచ్చాయోమో? అని అంటున్నారు.



Next Story

Most Viewed