స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్

by Disha Web Desk 7 |
స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: ఇటీవల వచ్చిన ‘సలార్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. వాటిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ ఒకటి. ఈ మూవీలో ప్రభాస్ ఓ నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని, యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా చెప్పిన విషయం తెలసిందే. తాజాగా మరోసారి ఈ మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ వంగా వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో నటించే పాత్రల గురించి ఇంకా రివీల్ చేయాల్సి ఉంది.


Next Story

Most Viewed