ANY DAY, ANY PLATFORM, I AM WAITING.. డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ వార్నింగ్!

by Disha Web Desk 5 |
ANY DAY, ANY PLATFORM, I AM WAITING.. డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కు మాస్ వార్నింగ్ ఇస్తూ.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖలో రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం అయ్యిందని, ఈ పదేళ్లలో ఉదహరణకి మీరు 10 ఇంటర్వూలు ఇచ్చి ఉంటే నేనే 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటానని అన్నారు. నేనెప్పుడూ కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదని కానీ, మీరు పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారని తెలిపారు.ఓ సందర్భంలో మిమ్మల్ని తీసెసీ వేరే కెమెరామెన్ తో సినిమా పూర్తి చేద్దామని ప్రస్తావన వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో ప్రవర్తిస్తున్నారని అనుకుంటారని నచ్చకున్న మీతోనే సినిమా పూర్తి చేశానని కుండ బద్దలు కొట్టారు.

ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా ఆ నింద మీ మీద మోపలేదని, నేను అలాంటి వ్యక్తిని కాదని, కానీ మీరు యాంకర్ అడగకున్నా నా ప్రస్థావన తీసి నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక తన ఆత్మాభిమానంతో పాటు మీ మీద గౌరవంతో ఇంకెక్కడా తన ప్రస్థావన తేవద్దని ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. అంతేగాక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అంటే ANY DAY, ANY PLATFORM, I AM WAITING అని హరీష్ శంకర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.






Next Story

Most Viewed