పిల్లలను వేధిస్తున్న చికెన్ పాక్స్ .. వేసవితో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం!

by Dishafeatures1 |
పిల్లలను వేధిస్తున్న చికెన్ పాక్స్ .. వేసవితో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం!
X

దిశ, ఫీచర్స్ : చికెన్ పాక్స్... అంటే తల్లి పోయడం, అమ్మవారు, అమ్మోరు, ఆటలమ్మ, పెద్దతల్లి, చిన్న తల్లి,శీతాలమ్మ, మాత....ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఈ చికెన్ పాక్స్ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ చికెన్ పాక్స్ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో... అప్పుడు ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక అంటూ వ్యాధి.. చికెన్ పాక్స్ సోకిన వ్యక్తి తో పాటు మనం కూడా ఉంటే ఆ వైరస్ మనకు కూడా సోకే అవకాశం ఎక్కువ. అలాగే ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుంది. కాబట్టి చికెన్ పాక్స్ వచ్చిన వారికి పిల్లలను దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ మద్యకాలంలో ముఖ్యంగా ఈ చికెన్ ఫాక్స్ పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. తాజాగా కేరళలో చికెన్ పాక్స్ కారణంగా తొమ్మిది మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే ఈ చికెన్ పాక్స్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి త్వరగా సోకుతుంది. అందుకే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు చికెన్ పాక్స్ సోకితే కాస్త ప్రమాదం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అది పిండానికి కూడా హాని కలిగించే అవకాశం ఉంటుంది. చికెన్ పాక్స్‌కు సరైన సమయంలో చికిత్స అందకపోతే కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.కానీ చికెన్ పాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. చంటి పిల్లలకు కూడా చికెన్ పాక్స్ రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం.

చికెన్ పాక్స్ ముఖ్య లక్షణాలు :

ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ముందు ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి. తీవ్ర అలసట,ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. చర్మంపై ఎరుపు దద్దుర్లు, బొబ్బలు వంటివి కనిపిస్తాయి. ఇది మొదటగా ముఖంపై, నోటిపై నాలికపై కనిపిస్తాయి. తర్వాత ఛాతి ఇతర శరీర భాగాలకు సోకుతాయి. ఇలా ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. పిల్లలను కూడా వీరికి దూరంగా ఉంచండి. అలాగే ఈ వేసవిలో పిల్లలు ధరించే దుస్తులు, ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. లేదు అంటే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.

ఇది శరీరంలో ప్రవేశించిన తర్వాత వైరస్ మొదటి 10-20 రోజుల్లో కాలేయం, ప్లీహంలోనూ, ఇంద్రియ గ్యాంగ్లియాన్స్‌లోనూ వృద్ధి చెందుతుంది . శరీరమంతా వ్యాపించి శ్వాసకోశానికి, చర్మానికి పాకుతుంది. మొదటి దశ పూర్తిగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండదు. ఈ దశలో రాగి వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందదు.

కానీ రెండో దశ 24 - 48 గంటలు ఉండి, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం మొదలైన రెండో - మూడో రోజున ఎర్రటి పొక్కులు ముందుగా మొహం, ఛాతి, వీపు పైన మొదలై రెండు మూడు రోజుల్లో కాళ్లు చేతులకు కూడా వ్యాపిస్తాయి. పొక్కులు మొదట ఎర్రగా చిన్నగా ఉండి, రెండు మూడు రోజుల్లో నీటి బుడ్లలా మారి మధ్యలో చిన్న గంట పడుతుంది. దాని చుట్టూ చర్మం ఎర్రగా కమిలి ఉంటుంది. ఇంగ్లీషులో దీన్ని ‘పెర్ల్ ఆన్ రోజ్ పెటల్’ అని అంటారు. ఇది విపరీతమైన దురద కలిగివుంటాయి. కళ్లు, పెదవులు, నోటి లోపల, జననేంద్రియాలపై కూడా ఈ నీటి పొక్కులు వస్తాయి. నోటి పూత, పేగులు పొక్కటం వలన అరుచి, అజీర్తి ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

చికెన్ పాక్స్‌కు సోకితే తీసుకొవాల్సిన జాగ్రతలు :

చికెన్ పాక్స్ సోకిన వ్యక్తిని శుభ్రమైన గాలి, వెలుతురు అధికంగా తగిలే గదిలో ఉంచాలి. కొందరికి చాలా పెద్ద పెద్ద బొబ్బలు వస్తాయి. అవి చాలా మంటగా నొప్పిగా ఉంటాయి. కనుక అవి చీము పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.ఒక వేల అది పగిలి పోతే ఆయింట్మెంట్ వంటివి రాస్తూ ఉండాలి. తుమ్ము , దగ్గు వచ్చినప్పుడు నోరు, ముక్కుకు క్లాత్ లాంటిది వాడండి. దీనివల్ల అది గాలి ద్వారా ఇతరులకు సోకకుండా ఉంటుంది. ముఖ్యంగా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. పిచ్చి పిచ్చి స్వీయ చికిత్సలు మానేసి వైద్యులు సూచించిన వందులను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే చికెన్ పాక్స్ ప్రమాదం నుంచి త్వరగా బయట పడవచ్చు. కానీ కొంత మంది వేపాకుల పై పడుకోబెట్టడం, పసిపిల్లలకైనా పాలివ్వక పోవడం, పసుపు, వేపాకు ముద్దలు తినిపించడం, నూనె తాగించడం, పోషకాహారం ఇవ్వకుండా చప్పిడి తిండి పెట్టడం, స్నానం పోయకపోవడం ఇంకా ఎన్నో వింత పనులు చేస్తూ ఉంటారు. ఇది రోగంని పెంచుతుంది తప్ప తగ్గించదు మీరు గుర్తుపెట్టుకోండి.


Next Story

Most Viewed