ఆ పని చేయడం వల్లే నాగ చైతన్యకి ఆ రేంజ్‌లో లక్ .. అసలు ఏమైందంటే?

by Kavitha |
ఆ పని చేయడం వల్లే నాగ చైతన్యకి ఆ రేంజ్‌లో లక్  .. అసలు ఏమైందంటే?
X

దిశ, సినిమా: ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత ఏమాయ చేసావే సినిమాతో ఫుల్ క్రేజ్‌ను సంపాదించాడు. అందులో తన సరసన నటించిన సమంతతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే విరూపాక్ష డైరెక్టర్ తో మరొక సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అలాగే ప్రస్తుతం కల్కి సినిమాతో చరిత్ర తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్నా నాగ్ అశ్విన్ కూడా ఇప్పుడు నాగచైతన్య సినిమాకు కమిట్ అయ్యాడు అన్న వార్త వైరల్ గా మారింది. దానికి కారణం రీసెంట్ గా కల్కి సినిమాలోని బుజ్జి వెహికల్ నాగచైతన్య డ్రైవ్ చేయడమే.

నాగచైతన్యకి మొదటి నుంచి కార్లు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే . అయితే కల్కి సినిమాలోని బుజ్జి పై మనసు పారేసుకున్న నాగచైతన్య ఏకంగా బుజ్జితో కలిసి ఒక సూపర్ ఫాస్ట్ రైడ్ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో ప్రోమో ని కూడా కల్కి మేకర్స్ నెట్టింట షేర్ చేయగా అది సెకండ్స్ లోనే వైరల్ గా మారింది. అంతేకాదు వీళ్ళ కాంబోలో ఓ సినిమా రాబోతుంది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో నాగచైతన్య కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అంటున్నారు జనాలు .




Next Story

Most Viewed