సల్మాన్ ఖాన్ మర్డర్ స్కెచ్ మామూలుగా లేదు.. అందుకే భారీ మొత్తంలో సుపారి ఆఫర్..

by Dishafeatures3 |
సల్మాన్ ఖాన్ మర్డర్ స్కెచ్ మామూలుగా లేదు.. అందుకే భారీ మొత్తంలో సుపారి ఆఫర్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై ఎటాక్ చేస్తామని ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇలా బెదిరించిన ప్రతీసారి ఆయన ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచుతున్నారు పోలీసులు. అయితే ఏప్రిల్ 14న ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బాంద్రాలోని సల్లూ భాయ్ ఇంటి ఎదుట కాల్పులు జరిపారు దుండగులు. విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి ఏప్రిల్ 13న అంటే ఎటాక్ జరిగే ముందురోజు గన్ హ్యాండ్ ఓవర్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక సల్మాన్‌పై దాడి కోసం ఒక్కొక్కరికి రూ. 5లక్షల సుపారి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందులో అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు చెల్లించగా.. మిగిలినవి ప్లాన్ సక్సెస్ అయ్యాక ఇస్తామని చెప్పారట. అయితే వారి ఉద్దేశం కేవలం భయపెట్టడమే కానీ మర్డర్ చేయడం కాదని కూడా తెలుస్తుంది. ఇక ఈ ఇన్సిండెంట్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో తేలగా.. మహారాష్ట్రలో గ్యాంగ్‌స్టర్స్ లేదా గ్యాంగ్ వార్స్‌కు చోటులేదని, అతన్ని ఖతమ్ చేస్తామని తెలిపాడు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. ఎలాంటి అపాయం రాకుండా చూసుకుంటామని సల్మాన్‌కు హామీ ఇచ్చాడు.

Next Story