వృషభ రాశిలోకి సంచరించనున్న గురు గ్రహం.. ఈ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్..

by Disha Web Desk 10 |
వృషభ రాశిలోకి సంచరించనున్న  గురు గ్రహం.. ఈ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్..
X

దిశ, ఫీచర్స్: ఈ రోజు బృహస్పతి, వృషభరాశిలోకి సంచరించడం వల్ల ఈ రాశుల వారికి విపరీతమైన రాజయోగం, లాభాలు కలుగుతాయి. మీరు, మీ ప్రస్తుత స్థానం కంటే ఉన్నత స్థానాన్ని సాధించగలరు. గురుడు మే 25, 2025 వరకు వృషభ రాశి లోనే ఉండనున్నాడు. గురు గ్రహం, శుక్రుడి రాశి అయిన వృషభంలో ప్రవేశించినప్పుడు అతని ఆధ్యాత్మిక దిశ మారుతుంది. దీని ప్రభావం ఈ రాశుల వారిపైన చూపనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి

ఈ రాశిలోకి బృహస్పతి సంచారము వలన కుటుంబ పరిస్థితులు క్రమంగా మారతాయి. ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నత స్థితికి వెళ్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది. మీరు పనిలో అధికారంలో ఉన్న వారి నుండి గౌరవం పొందుతారు. ప్రతిభ, నైపుణ్యాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి

బృహస్పతి సంచారం వల్ల ఈ రాశి వారికి లాభం చేకూర్చడానికి బదులు ఇప్పటి వరకు ఉన్న అనేక కష్టాలు, నష్టాలు తొలగిపోతాయి. ఎవరైనా ఏ రంగంలోనైనా తమ అంచనాలకు మించి పురోగతి సాధించగలరు. కెరీర్ వృద్ధికి, వృత్తి, వ్యాపారాలలో గొప్ప విజయానికి అవకాశం ఉంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. చెడు వ్యసనాల నుండి బయటపడతారు.

Next Story