'కుత్తే'.. నాకు ప్రత్యేకమైన సినిమా: అర్జున్ కపూర్

by Dishanational2 |
కుత్తే.. నాకు ప్రత్యేకమైన సినిమా: అర్జున్ కపూర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన అప్‌కమింగ్ మూవీ 'కుత్తే' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. డార్క్ కామెడీ అని ప్రచారం జరుగుతున్న చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తున్న ఆయన.. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలావుంటే.. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. ''కుత్తే' కథలోని కొత్తదనాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారని ఆశిస్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. ప్రతిభావంతులైన నిర్మాత లవ్ రంజన్, దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్, విశాల్ భరద్వాజ్‌, గుల్జార్ సాబ్‌తో కలిసి పని చేసే అవకాశం లభించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. టబు, కొంకణా సేన్ శర్మ, నజీర్ సర్, కుముద్ జీ, శార్దూల్ భరద్వాజ్, రాధికా మదన్ వంటి నటులతో షూటింగ్ సరదాగా అనిపించింది. దీన్ని గొప్ప అభ్యాస అనుభవంగా భావిస్తున్నా. ఇలాంటి సినిమాలు ఏ నటుడికైనా నేర్చుకునే అవకాశం కల్పిస్తాయి. మన దేశంలోని అత్యుత్తమ నటులతో కలిసి పనిచేస్తూ నా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమా 2023 జనవరి 13న విడుదలకానుంది.



Next Story

Most Viewed