ఏప్రిల్-19: టాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా బర్త్ డే

by Disha Web Desk 6 |
ఏప్రిల్-19: టాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా బర్త్ డే
X

దిశ, సినిమా: నేడు టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా పుట్టిన రోజు జననం 19 ఏప్రిల్ 1990. ఈ అమ్మడు ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అమీ తుమీ, బండిపోతు, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేసింది.

చివరిగా మామా మశ్చీంద్ర తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈషా రెబ్బా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అలాగే ఏ సినిమాలోనైనా అవకాశం వస్తే కాదు చేయను అనకుండా తన నటన, అందంతో మెప్పిస్తుంది.

Next Story

Most Viewed