బిడ్డ ఏడుపుపై నోటిఫికేషన్ ఇచ్చిన యాపిల్ వాచ్

by Dishanational4 |
బిడ్డ ఏడుపుపై నోటిఫికేషన్ ఇచ్చిన యాపిల్ వాచ్
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ బ్రాండ్స్‌లో యాపిల్ ఒకటి. దీనికున్న మిలియన్ల కొద్దీ వినియోగదారులే అందుకు నిదర్శనం. ఇక యాపిల్ ఉత్పత్తులపై కేటాయించే ప్రతి పైసా విలువైనదని నమ్ముతుంటారు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సహా మెసేజ్, కాల్స్ గురించి హెచ్చరించడం వరకు కుపెర్టినో-ఆధారిత కంపెనీ వాచీలు iPhoneకు పొడిగింపుగా పనిచేస్తున్నాయి. ఇక యాపిల్ వాచ్ యూజర్ ప్రాణాధారాలను ట్రాక్ చేస్తుందని, ఆరోగ్య పురోగతిని చెక్ చేస్తుందని తెలిసిందే. కానీ ఇంటి లోపల 'లౌడ్ ఎన్విరాన్‌మెంట్'ను కూడా అంచనా వేయగలదని మీకు తెలుసా?

ఇటీవల 'కెల్సీ ఫరీష్' అనే మహిళ ధరించిన యాపిల్ వాచ్‌.. నోటిఫికేషన్‌ ద్వారా ఆమె చుట్టూ ఉన్నటువంటి 'లౌడ్ ఎన్విరాన్‌మెంట్' గురించి హెచ్చరించింది. 'లౌడ్ ఎన్విరాన్‌మెంట్ : సౌండ్ లెవెల్స్ 90 డెసిబుల్స్‌ను తాకాయి. ఈ స్థాయిలో దాదాపు 30 నిమిషాలు ఉంటే తాత్కాలిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది' అని వార్నింగ్ ఇచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అసలు విషయానికొస్తే.. బాబు ఏడుపును గుర్తించిన వాచ్, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇచ్చిందని వివరించింది. దీంతో తను వెంటనే అలర్ట్ అయినట్లు తెలుపుతూ.. టెక్నాలజీకి థాంక్స్ చెప్పింది. కాగా 13,000 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేయబడిన ట్వీట్.. 188k పైగా లైక్స్ పొందడం విశేషం.

ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. తమ ఇంట్లో పిల్లల ఏడుపుకు సంబంధించిన కథనాలు షేర్ చేసుకుంటూ యాపిల్ వాచ్ కాస్త రిలాక్స్ తీసుకోమని హెచ్చరించాలని అనుకుంటుందేమో అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. యాపిల్ వాచ్‌ను కలిగి ఉండటం అనేది నిత్యం అత్తగారు వేధించడం లాంటిదని, నిరంతరం నోటిఫికేషన్స్‌తో చంపేస్తుందని చమత్కరిస్తున్నారు.




Next Story

Most Viewed