జనాలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.. ఫేక్ వీడియోలపై నటి ఫైర్

by Disha Web Desk 6 |
జనాలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.. ఫేక్ వీడియోలపై నటి ఫైర్
X

దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి, 'లాక్ అప్' ఫేమ్ అంజలి అరోరా నెటిజన్లపై దుమ్మెత్తిపోసింది. తనపై తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తున్న MMS లీక్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది. ఫేక్ న్యూస్ కారణంగా తన ఫ్యామిలీ సఫర్ అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యూస్ పెంచుకోవడం కోసం అనుమతి లేకుండా తన పేరును వీడియోకు జోడించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. 'ప్రజలు నన్ను ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారో తెలియదు. వాళ్లలాగే నాకు కూడా ఒక కుటుంబం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలన్నిటినీ చూస్తుంది.

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. మంచి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పరువు తీయడానికి జనాలు ఈ స్థాయికి దిగజారడం నిజంగా సిగ్గుచేటు. ఇలాంటివి చూసిన ప్రతిసారి నా గుండె పగిలిపోతుంది' అని చెప్పుకొచ్చింది. ఇక తనపై ఇలాంటి ఫేక్ వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదన్న అంజలి.. వీటిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.


Next Story

Most Viewed