పెళ్లై పిల్లలున్న హీరోకి యంగ్ హీరోయిన్‌తో మళ్లీ పెళ్లి చేసే ప్రయత్నం చేసిన యాంకర్ సుమ..? ఇందులో నిజమెంత

by Disha Web Desk 6 |
పెళ్లై పిల్లలున్న హీరోకి యంగ్ హీరోయిన్‌తో మళ్లీ పెళ్లి చేసే ప్రయత్నం చేసిన యాంకర్ సుమ..? ఇందులో నిజమెంత
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు షోల్లో యాంకర్‌గా వ్యవహరిస్తూనే.. సినిమా ఈవెంట్స్, ప్రమోషన్ కార్యక్రమాలు చేసి స్టార్‌గా మారిపోయింది. ఇప్పటికీ వరుస షోలతో బిజీ బిజీగా ఉంటుంది. అయితే సుమ పెళ్లై పిల్లలు ఉన్న హీరోకు రెండో పెళ్లి చేసే ప్రయత్నం చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతనెవరు అని కంగారు పడుతున్నారా? అదంతా నిజపీవితంలో కాదులెండి ఓ మూవీ ప్రమోషన్స్‌లో పెళ్లి పెద్దగా మారి అలా చేసినట్లు తెలుస్తోంది. కేవలం మూవీపై హైప్‌ను పెంచి అందులో నటించిన హీరోహీరోయిన్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీకి అందరూ అట్రాక్ట్ అయి సినిమా చూస్తారని స్క్రీప్ట్‌లో భాగంగా చేసినట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కలిసి నటించిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు కానీ పెళ్లి చేసుకోరు.. అల్లరి నరేష్ పడిన కష్టాలు చూపిస్తారు. అయితే చివరి వరకు వారికి పెళ్లైందా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇందులో కిశోర్, వైవా హర్ష, అరియానా గ్లోరి కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మే 03 న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే, ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాతో పాటు మేకర్స్ పాల్గొన్నారు. అయితే అక్కడే యాంకర్ సుమ హీరో,హీరోయిన్‌కు ఫన్నీగా పెళ్లి చేసే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. కానీ అదంతా సినిమా కోసమే చేసినట్లు టాక్. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed