ఆమె నన్ను అలా కొట్టడం వల్లే ఇలా తయారయ్యానంటూ అనసూయ పోస్ట్.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
ఆమె నన్ను అలా కొట్టడం వల్లే ఇలా తయారయ్యానంటూ అనసూయ పోస్ట్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: అనసూయ యాంకర్‌గా జబర్దస్త్ షోతో బుల్లితెరకు పరిచయం అయి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కొద్ది కాలంపాటు యాంకర్‌గా పలు షోలు చేసి ప్రత్యేక ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యాంకరింగ్ మానేసి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుస చిత్రాలు చేసి స్టార్ నటి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో ట్రోల్స్, ఎదుర్కొంటుంది. అయినప్పటికీ తనకు నచ్చిన పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, అనసూయ తన ఇన్‌స్టాలో చిన్నప్పటి ఫొటో షేర్ చేసింది. ఓ పాప్ సాంగ్ పెట్టి అప్పుడు.. ఇప్పుడు హాట్‌గా కనిపించేలా పోజులు ఇచ్చిన ఫొటోలతో వీడియో క్రియేట్ చేసి పెట్టింది. అలాగే ‘‘ఆమె కొట్టడం వల్లే నేను ఇలా టాండోలా మారిపోయాను’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్యూట్‌గా ఉన్నారని ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Read More..

Anchor Anasuya : ఆ వీడియో షేర్ చేస్తూ మరోసారి ఇచ్చిపడేసిన అనసూయ.. అన్నీ చూపించేస్తుంటే ఆగలేకపోతున్నామంటున్న నె...


Next Story

Most Viewed