ఎన్టీఆర్ సినిమాల్లో ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం..చిరంజీవి కామెంట్స్ వైరల్

by Dishafeatures1 |
ఎన్టీఆర్ సినిమాల్లో ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం..చిరంజీవి కామెంట్స్ వైరల్
X

దిశ,సినిమా: మన తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి అందరికీ సుపరిచితమే. తన నటనతో అందరినీ ఆకట్టుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఒకే ఒక హీరో గా కూడా గుర్తింపు పొందాడు. అతను పద్మభూషణ్(2006),పద్మ విభూషణ్(2024) పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ కి ఇష్టమైన హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఆయన చేసిన సినిమాల్లో చిరంజీవి కి నచ్చిన సినిమా ఏంటి అని అడగగా చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ సినిమాల్లో ‘టెంపర్’ సినిమా( Temper Movie ) అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇందులో స్పెషల్ గా కోర్టు సీన్ మరీనూ ఇష్టం అని అందులో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ ని రిపీట్ గా చూశానని చెప్పుకొచ్చారు.

ఇక అంతకు ముందు వరుస ఫెయిల్యూర్ లో ఉన్న ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాతోనే సక్సెస్ అయ్యడనీ అందరికీ తెలిసినదే. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే వరుసగా 6 సక్సెస్ లు నమోదు చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఏడవ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు... ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర లో నటిస్తున్నాడు.

Read More..

అప్పుడే మొదటిసారి అతనితో ప్రేమలో పడ్డాను..



Next Story

Most Viewed