ఇదో మరుపురాని ప్రయాణం.. మైనపు విగ్రహంగా కొలువు తీరిన అల్లు అర్జున్

by Disha Web Desk 8 |
ఇదో మరుపురాని ప్రయాణం.. మైనపు విగ్రహంగా కొలువు తీరిన అల్లు అర్జున్
X

దిశ, సినిమా : అల్లు అర్జున్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ హీరో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని, ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇక పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

కాగా, తాజాగా అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. ఇక ఈ విగ్రహాన్ని బన్నీ స్వయంగా వెళ్లి ఆవిష్కరించడం విశేషం.ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే..గంగోత్రి సినిమా కూడా రిలీజై 21 ఏళ్లు అవుతుంది. అలాంటి స్పెషల్‌డే రోజు అల్లు అర్జున్ మైనపు విగ్రహా ఆవిష్కరణ జరిగింది. దీంతో బన్నీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది మరుపురాని ప్రయాణం..నా మొదటి సినిమా గంగోత్రి 2003లో ఇదే రోజున విడుదలైంది. అలాంటి ముఖ్యమైన రోజే నా మైనపు విగ్రహాన్ని దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా చేతులతో నేనే ప్రారంభిస్తున్న. ఈ 21 సంవత్సరాల సినీ కెరీర్ నా జీవితంలో మరుపురాని ప్రయాణం. దీనికి మీ అందరికీ నేను కృతజ్ఞుడను. మీ ప్రేమ, అభిమానం నాపై ఉన్నది, ఇక ముందు కూడా మీరు గర్వించేలా చేస్తానని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.


Next Story