అల్లు అరవింద్ కాంట్రవర్సీ కామెంట్స్..! ఫిల్మ్ నగర్‌లో రచ్చరచ్చ

by Disha Web Desk 7 |
అల్లు అరవింద్ కాంట్రవర్సీ కామెంట్స్..! ఫిల్మ్ నగర్‌లో రచ్చరచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ‘గీతా ఆర్ట్స్’ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన ఆయన.. కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ డైలాగ్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్లు జూనియర్లకు స్పేస్ ఇవ్వాలన్నారు. కొత్తవాళ్లను తొక్కేయకూడదని అంటూ.. చందు మొండేటికన్న ముందు మరొక వ్యక్తిని అనుకున్నామని, కానీ అతడు గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లాడని చెప్పారు. అతనికి అవకాశం ఇచ్చింది మనమేనన్నారు. అతను ఎవరో ఇప్పుడే చెప్పనని తెలిపారు. అయితే దర్శకుడు పరుశురామ్‌ను టార్గెట్‌ చేసి నిర్మాత అల్లు అరవింద్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఆ కండీషన్ ఒప్పుకున్నాకే, లావణ్యతో పెళ్లికి వరుణ్ తేజ్ ఒకే చెప్పాడా?

విజయ్ దేవరకొండ పై ఉన్న ప్రేమను బయట పెట్టిన సమంత


Next Story