నవ్వులే నవ్వులు.. ఆసక్తికరంగా అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ట్రైలర్.. అల్లరోడి పెళ్లి కష్టాలు మామూలుగా లేవుగా.. (వీడియో)

by Dishafeatures2 |
నవ్వులే నవ్వులు.. ఆసక్తికరంగా అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ట్రైలర్.. అల్లరోడి పెళ్లి కష్టాలు మామూలుగా లేవుగా.. (వీడియో)
X

దిశ, సినిమా : తెలుగు సినీ తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న హీరోల్లో అల్లరి నరేష్ రూటే సపరేటు. ఎక్కువగా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటతో, కామెడీ డైలాగులతో ఆకట్టుకునే ఈ హీరో గత కొన్నేండ్లుగా కడుపుబ్బా నవ్వించే వైవిధ్య భరితమైన మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఏడాది మొదట్లోనే అక్కినేని నాగార్జునతో కలిసి ‘నా సామిరంగ’లోనూ తన ప్రతిభ చాటిన నరేష్, ప్రజెంట్ మరో సూపర్ ఎంటర్టైన్మెంట్ జోనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మల్లి అంకం డైరెక్షన్‌లో, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీని చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించారు. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల్లో ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో నరేష్ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరోవైపు విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో రీసెంట్‌గా నేచురల్ స్టార్ నానీ చేతుల మీదుగా మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ గురించి చెప్పుకుంటే.. ఇందులో అల్లరి నరేష్ కామెడీ మరో లెవల్‌లో ఉంటుందనేది అర్థం అవుతోంది. పెళ్లీడుకొచ్చిన నరేష్ తన జీవిత భాగస్వామిని సెట్ చేసుకోవడానికి ఎంత ప్రయాస పడతాడో ట్రైలర్‌లో మెయిన్ రోల్‌గా చూపించారు. ఇక ఇందులో హీరో నరేష్ తనకు ఎదురు పడ్డ ప్రతి ఒక్కరితో ‘‘మీకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చెప్పండి... నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు’’ అని చెప్తుంటాడు. అంతేకాకుండా తనకు సెట్ అయ్యే జోడీకోసం హ్యాపీ మ్యా్ట్రిమోనీకి వెళ్తాడు నరేష్.

మ్యాట్రిమోనీలో దాదాపు 49 సంబంధాలు చూసినా.. ఒక్క మ్యాచ్ కూడా కుదరకపోవడంతో తనకు 50వ సంబంధమైనా సెట్ అవుతుందో లేదో అని తెగ టెన్షన్ పడిపోతున్న అల్లరోడికి అనుకోకుండా సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వెంటనే పెళ్లిమీద ఎటువంటి అభిప్రాయం లేనటువంటి ఆమెతో లవ్‌లో పడిపోతాడు నరేష్. ఇక ఆమె మనసులో స్థానం సంపాదించి పెళ్లి పీటల దాకా వెళ్తాడా లేదా? అనేది ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో ఇంట్రెస్టింగ్ అంశంగా ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఇతర కమెడియన్స్ వెన్నెల కిషోర్, హరితేజ, వైవా హర్ష, రఘుబాబు, శకలక శంకర్ కూడా కనిపిస్తుండగా, బాలీవుడ్ హాస్య నటుడు జానీ లివర్ డాటర్ జామీ లివర్ కూడా కీలకపాత్రలో దర్శనమిచ్చింది. ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయించేదిగా ఉన్నప్పటికీ అసలు ట్విస్ట్ తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed