సోనుసూద్ ఆస్తుల తాకట్టు.. నిజమేనా?

by  |
సోనుసూద్ ఆస్తుల తాకట్టు.. నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో దేశ ప్రజలకు ఆపద్భాందవుడిగా నిలిచిన వ్యక్తి సోనుసూద్. హిందీ, తెలుగు, తమిళ, మళయాల చిత్రాల్లో విలనిజం చూపించిన నటుడు. అప్పటి వరకు ఆయన దేశ ప్రజలకు విలన్ గానే తెలుసు. కరోనాతో దేశంలో విధించి లాక్ డౌన్ తో ఆయన రియల్ హీరో అయ్యారు. వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి ఇంటి వరకు చేర్చిన మహానుభావుడు. ఆ తర్వాత కూడా ఎందరో నిస్సహాయులకు ఆపన్న హస్తం అందించిన దానకర్ణుడు సోనుసూద్. అడిగిన వారికి ఎముకలేని చెయ్యి వల్లే సాయం అందించిన ఆయన.. నేడు కష్టాలకు ఎదురీగుతున్నాడు.

కరోనా వల్ల సినిమాలు ఆగిపోవడం, లాక్ డౌన్ వల్ల తనకున్న హోటల్స్, ఇతర వ్యాపారాలు నిలిచిపోవడంతో సోనుసూద్ ఆదాయం పడిపోయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఆపన్నలు సహాయం కోసం ఆర్ధిస్తుండడంతో వారికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో సోనుసూద్ ఆస్తులు కరిగిపోయాయని ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ లు జరుగుతున్నా.. పారితోషికాలు పూర్తి స్థాయిలో అందలేదట. ఈ పరిస్థితి సోనుసూద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీలో బీటౌన్ వర్గాల సమాచారం ప్రకారం సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10కోట్లు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో రూ.కోట్ల విలువైన ఆరు ప్లాట్లు, రెండు షాపులను తాకట్టు పెట్టినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఆ ఆస్తులన్నీ కూడా ఆయన భార్య సోనాలికి చెందినవిగా సమాచారం. తాకట్టు ఒప్పందం ప్రకారం నవంబర్ 24న ఆస్తుల రిజిస్టర్ చేశాడని బాలీవుడ్ టాక్. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. తమ దేవుడిని కష్టం రాకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed