జూ పార్క్‌లో మౌస్‌డీర్ పోస్టర్ ఎగ్జిబిషన్ ప్రారంభం

by  |
జూ పార్క్‌లో  మౌస్‌డీర్ పోస్టర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఆజాదీ కా అమిృత్ మహోత్సవ్ లో భాగంగా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో గురువారం మౌస్ డీర్ పై పోస్టర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ క్యూరేటర్ ఏ.నాగమణి మాట్లాడుతూ 2010 సంవత్సరం లో మౌస్ డీర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు తెలిపారు. మౌస్ డీర్ ఒంటరి పిరికి జంతువు అని, దీనిని జీవన శిలాజ అని కూడా పిలుస్తారని చెప్పారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో విజయవంతంగా సంతానోత్పత్తి చేసిన అనంతరం మౌస్ డీర్స్ మొదటి బ్యాచ్ 2017 సంవత్సరంలో అడవిలోకి విడిచిపెట్టడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా పొదుపు పక్షులు , జంతువుల కోసం జూ ప్రాంగణంలో అడవి పండ్ల చెట్ల పెంపకాన్ని ఆమె ప్రారంభించడంతో పాటు ఈగిల్ మార్మెలోసా (మారేడు) మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని బాదమ్, ఫికస్ జాతులు (రెలిజియోసా), కార్డియా, జామున్, మహువా, కదంబ, ఇర్కి, కుసుమ, మేడి, ఆమ్లా, పొగాడ మొదలైన మొక్కలను నాటారు.

Next Story

Most Viewed