5వేల మంది ఖైదీలను విడుదల చేసిన మొరాకో

by  |
5వేల మంది ఖైదీలను విడుదల చేసిన మొరాకో
X

రబాత్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పలు దేశాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మొరాకో కూడా అదే దారిలో వెళ్తూ.. అక్కడి జైళ్లలో ఉంటున్న 5,600 మంది ఖైదీలను విడుదలకు ఆదేశించింది. వీరందరికీ క్షమాభిక్ష ప్రసాదించి విడిచి పెడుతున్నట్లు మొరాకో రాజు కింగ్ మహమ్మద్ ప్రకటించారు. మొరాకో జైళ్లు ఎప్పుడూ కిక్కిరిసి పోయి ఉంటుంటాయి. ఒక్కో బ్యారాక్‌లో 50 మంది కంటే ఎక్కువ ఉంటుంటారు. ఈ విషయాలను అక్కడి న్యాయశాఖ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొరాకో జైళ్లలో ఉంటున్న 5,654 మందిని వయస్సు, ఆరోగ్యం, సత్ప్రవర్తన, ఎన్నాళ్ల నుంచి నిర్బంధంలో ఉన్నాడనే విషయాన్ని పరిగణలోనికి తీసుకొని విడుదలకు ఎంపిక చేసినట్లు న్యాయ శాఖ తెలిపింది. వీరందరినీ దశల వారీగా విడుదల చేస్తామని.. బయట పరిస్థితులను కూడా అంచనా వేసి.. వీరి ఆరోగ్యాలకు పూర్తి భద్రత ఉంటుందన్న భరోసా వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ చేపడతామని న్యాయశాఖ తెలిపింది. మొరాకోలో ఇప్పటి వరకు 960 మందికి కరోనా పాజిటీవ్ తేలగా 66 మంది కోవిడ్ 19 వల్ల మృతి చెందారు. కాగా, మొరాకోలో ప్రతీ లక్ష మందిలో 232 మంది జైళ్లలోనే ఉంటున్నారు.

Tags: Prisoners, release, morocco, coronavirus, pandemic

Next Story