నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం..

by  |
నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం..
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఇఎస్ఐ స్కాంలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నివాసంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కుంభకోణంలో నాయిని నర్సింహారెడ్డి.. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డిలు ప్రభావితం చేసినట్టుగా ఉన్న సమాచారంతో పాటు శ్రీనివాస్ రెడ్డి, ముకుందరెడ్డిలు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటితో పాటు, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంతో పాటు ముకుందరెడ్డి, ఆయన బంధువులుగా భావిస్తున్న వినయ్ కుమార్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి ఇళ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, ముకుందరెడ్డి, వినయ్ కుమార్, ప్రమోద్ రెడ్డి ఇళ్ల నుంచి ఈడీ అధికారులు కోట్లాధి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అయితే, ఎంత మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని ఈడీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రోజు రాత్రి గానీ, ఆదివారం ఉదయం కానీ ఈడీ అధికారులు సోదాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Next Story