బెంగాల్ సువర్ణకల నెరవేరబోతోంది.. మోదీ

by  |
బెంగాల్ సువర్ణకల నెరవేరబోతోంది.. మోదీ
X

దిశ, వెబ్ డెస్క్: కోలకతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ బెంగాళ్కుశాంతి,బంగారు, ప్రగతీశీల భవష్యత్ కావాలన్నారు. రాబోయే 25 సంవత్సరాలు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమని, వచ్చే 5సంత్సరాలలో ఇక్కడ అభివృద్ధి రాబోయే 25 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. మార్పుకోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదులకోలేదని ప్రధాని అన్నారు. అలానే ’మా, మాతి మనుష్‘ కోసం పనిచేస్తామని మమత హామి ఇచ్చింది..కానీ గత పదేళ్లలో టిఎసీ ఇక్కడి సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుక రాగలిగిందా అని మోడీ ప్రశ్నించారు.

అలానే బెంగాల్లో ప్రజాస్వామ్యవ్యవస్థ నాశనమైదని ..ఈ వ్యవస్థని బీజేపీ బలోపేతం చేస్తుందన్నారు. బెంగాల్ ప్రజలు మమతని ’దీదీ‘గా ఎన్నుకున్నారు, గానీ మేనల్లుడికి అత్తగానే ఆమే మిగిలిపోయిందన్నారు. బెంగల్ ప్రజలు మమత నుంచి ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతున్నారని మోడీ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, లెప్ట్, కాంగ్రెస్ తో పాటు బెంగాల్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఒక వైపు, బెంగాల్ ప్రజలు మరోవైపు ఉన్నారన్నారు. బెంగాల్ సువర్ణకల నెరవేరబోతోదని బెంగాల్ అభివృద్ధి, పెట్టుబడుల పెంపు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణ, లో మార్పు తీసుకొస్తానని తాను హామీ ఇస్తున్నానని మోడీ అన్నారు.

Next Story

Most Viewed