అనుబంధ సంస్థ విక్రయానికి సిద్ధమైన మహీంద్రా!

by  |
అనుబంధ సంస్థ విక్రయానికి సిద్ధమైన మహీంద్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ అనుబంధ సంస్థగా ఉన్న శాంగ్‌యాంగ్ మోటార్ కంపెనీని విక్రయించడానికి దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇటీవల నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థ దివాళ పిటిషన్‌ను వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కంపెనీలో మెజారిటీ వాటాను విక్రయించడానికి ఇప్పటికే తగిన చర్చలు మొదలుపెట్టినట్టు ఎంఅండ్ఎం తెలిపింది. మారో వారం రోఝుల్లోగా వాటాల అమ్మకంపై నాన్-బైండింగ్ ఒప్పందం చేసుకునే అవకాశాలున్నట్టు పేర్కొంది.

శాంగ్‌యాంగ్ సంస్థలో ఇప్పటికే ఎంఅండ్ఎంకు 75 శాతం వాటా ఉంది. తాజా చర్చల నేపథ్యంలో ఫిబ్రవరి నాటికి వాటా విక్రయానికి సంబంధించిన ఒప్పందం పూర్తవొచ్చని అంచనాలున్నాయి. కాగా, నష్టాలు పెరిగిపోయిన నేపథ్యంలో శాంగ్‌యాంగ్ దివాళా పిటిషన్‌ను వేసింది. దివాళ చట్టం ప్రకారం కంపెనీ పునరుద్ధరణ అంశపై దరఖాస్తు వేసింది. స్వతంత్ర పునర్‌వ్యవస్థీకరణ మద్దతు కోసం కూడా శాంగ్‌యాంగ్ అప్లై చేసింది. కాబట్టి ఇందులో భాగంగా శాంగ్‌యాంగ్ సంస్థ సొంతంగానే ప్రయత్నాలు చేసుకునే అవకాశమున్నట్టు ఎంఅండ్ఎం ఎండీ పవన్ గొయెంకా చెప్పారు.

ఫిబ్రవరి చివరి వరకూ కోర్టు గడువిచ్చిన నేపథ్యంలో ఎవరైన కంపెనీలో మెజారిటీ వాటాను దక్కించుకుంటే యథావిధిగా కొనసాగవచ్చు. లేదా పునరుద్ధరణ చర్యలు మొదలవుతాయి. ఒకవేళ ఒప్పందం కుదురితే కంపెనీలో మెజారిటీ వాటా కొత్త యాజమాన్యం చేతికి వెళ్తుంది. దాదాపు 30 శాతం మైనారిటీ వాటాతో ఎంఅండ్ఎ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి 20 శాతం పెట్టుబడుల కుదింపును కంపెనీ చేపట్టవచ్చని వెల్లడించారు.



Next Story

Most Viewed