ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ ఎల్.రమణ లేఖ

by  |
ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ  ఎల్.రమణ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయం గుదిబండగా మారే ప్రమాదం ఉందని, తగ్గించాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ కోరారు. సోమవారం ప్రధానమంత్రి మోడీకి జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ లేఖ రాశారు. కరోనాతో పాటు ప్రపంచీకరణ, మిల్లులుతో ఇప్పటికే హ్యాండ్లూమ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేంద్రం 5 నుంచి 12 శాతం జీఎస్టీ పెంపుతో మరింత ఆర్థికంగా చతికిలపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విధించిన జీఎస్టీ రద్దు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మరోసారి జీఎస్టీ పెంపు నిర్ణయం పరిశ్రమపై గుదిబండగా మారే ప్రమాదం ఉందన్నారు. వేలాది మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికే ప్రపంచీకరణ ప్రభావంతో డిమాండ్ తగ్గిందన్నారు. జీఎస్టీ పెంపుతో ధరలు పెరగడంతో పరిశ్రమలో ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుందన్నారు. ఐసీఎన్ జీ రన్ వ్యవధిలో ఉపాధి రేటు తగ్గుతందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ రాబోయే కాలంలో నిలదొక్కుకోవడానికి, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు జీఎస్టీ తగ్గించి బాసటగా నిలువాలని పీఎం మోడీని కోరారు.



Next Story

Most Viewed