కరోనా వేళ.. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

by  |
కరోనా వేళ.. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
X

దిశ,ఆర్మూర్: నిజమాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులో ఇంటి దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. మంగళవారం లక్ష్మీ నరసింహస్వామి, చౌడమ్మ ఆలయాల్లో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రజలంతా కరోనా నుంచి సురక్షితంగా బయటపడాలని కవిత ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు చేపట్టిన ఇంటింటి సర్వే విజయవంతమైందని, కరోనా పాజిటీవ్ రేటు తగ్గటంలో జ్వర సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. కరోనా కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మూడవ వేవ్ ముప్పు ప్రచారం నేపథ్యంలో ప్రజలంత ఎవరి జాగ్రతలు వారు పాటించాలని సుచించారు.

అనంతరం చౌడమ్మ ఆలయ ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించిన కవిత తమ ఇంటి దైవం లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయాన్ని గ్రామస్థుల సహకారంతో నిర్మిస్తామని ప్రకటించారు. ఆర్మూర్లోని నవసిద్దుల గుట్ట ఆలయంలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే రెండు జిల్లాలను కలిపే బ్రిడ్జి నిర్మాణం వలన చాలా అభివృద్ధి జరిగిందని, తెలంగాణ రాష్టంలో దేవాలయాలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు



Next Story

Most Viewed