నారా భువనేశ్వరికి క్షమాపణ తెలిపిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..

475
vamshi

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. నారా భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నానని ఓ ప్రముఖ ఛానల్ డిబేట్‌లో వెల్లడించారు. ఎమోషన్‌లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవమన్నారు. భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు తాను సైతం బాధపడుతున్నట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా. కులం నుంచి వెలివేస్తారనే భయంతో ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదన్నారు. అయితే ఇప్పుడు తాను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు.