పసుపు బోర్డు సంగతి చెప్పండి

by  |
పసుపు బోర్డు సంగతి చెప్పండి
X

దిశ, వెబ్ డెస్క్:
బీజేపీ ఎంపీ అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా మండి పడ్డారు. జిల్లాలో రైతులను కొందరు రెచ్చగొట్టి వారితో ఆందోళనలను చేయిస్తున్నారనీ ఆయన అన్నారు. గతేడాది భారీగా మొక్కజొన్నను కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చిందన్నారు. మొక్కజొన్న పంటలు వేయవద్దనీ సీఎం కేసీఆర్ కోరినప్పటికీ కొందరు రైతులు ఆ పంటను వేశారనీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ..రైతు పక్ష పాతి అని అన్నారు. ప్రతీ ఏడాది మన రాష్ట్రంలో పంటలు పెరుగుతున్నాయనీ అన్నారు. ప్రస్తుతం దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని అన్నారు. గతేడాది మొక్కజొన్న కొనుగోలుతో సర్కార్ కు రూ. 840 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కేవలం వడ్లను మాత్రమే కేంద్ర కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొక్కజొన్నను కేంద్ర కొనుగోలు చేయదని తెలిపారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చారు కదా…ఇప్పుడు పసుపు బోర్డు సంగతి చెప్పండనీ ఎంపీ అరవింద్ ను ఆయన ప్రశ్నించారు.

Next Story