వ్యాక్సినేషన్‌ పక్కాగా అమలు చేయండి : ఎమ్మెల్యే సండ్ర

by  |
MLA Sandra Venkata Veeraiah
X

దిశ, సత్తుపల్లి: సూపర్ స్పైడర్స్ గా ప్రభుత్వం గుర్తించిన వివిధ రంగాల వారికి శుక్రవారం సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించారు. స్థానిక గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లు, సిబ్బంది, పెట్రోల్ బంకులు, వంట గ్యాస్ సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ… నిబంధనల మేరకు ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని, విధిగా మాస్కు ధరించాలని కోరారు.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తోట కిరణ్ జర్నలిస్టుల వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ను అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, అగ్రికల్చర్ ఎ.డి నరసింహారావు, ఏసీపీ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ మీనన్, ఎంపీడీఓ సుభాషిణి, డీటీ సంపత్, ఏవో శ్రీనివాసరావు, సీఐ రమాకాంత్‌లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed