ఆశ చూపి మోసం చేయాలని చూస్తోంది..

by  |
ఆశ చూపి మోసం చేయాలని చూస్తోంది..
X

దిశ,సిద్దిపేట: రాష్ట్రాలకు నిధుల ఆశ చూపి రైతులకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మండి పడ్డారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తెచ్చిన విద్యుత్ బిల్లు రైతుల పాలిట శాపమని ఆయన అన్నారు. డిస్కంలకు రైతులు చార్జీలు చెల్లించాలని బిల్లులోనే ఉందని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రంలో మీటర్లు పెట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ బిల్లుతో ఒక్క దుబ్బాకలోనే 100 కోట్ల భారం పడుతుందన్నారు. గ్యాస్ సిలిండర్లకు కేంద్రం పరిమితి విధించిందని చెప్పారు. అలాగే కరెంట్ వినియోగం విషయంలోనూ పరిమితి విధిస్తే రైతు పరిస్థితి ఏమిటి ? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేత రఘునందన్ రావు మాటలు పచ్చి బూటకమని ఆయన అన్నారు. తనకు తాను మేధావి అని చెప్పుకుంటూ వస్తున్న రఘునందన్ రావుకు ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. దుబ్బాక ప్రజలు మంచి పాలనను కోరుకుంటున్నారని అన్నారు.

ఆనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా యావత్ దేశం ధర్నాలు, రాస్తారోకోలతో అతలాకుతలాం అవుతున్నదని అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా స్వయంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి ఉందన్నారు.



Next Story

Most Viewed