ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

by  |
ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో ఉన్న మంచిర్యాల క్లబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు సందర్శించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి ఐసోలేషన్ కేంద్రంలో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండటానికి ప్రత్యేక గది, సరైన వసతులు లేనివారు హైటెక్ సిటీలోని ఐసొలేషన్ కేంద్రంలో ఉండవచ్చని తెలిపారు. అన్ని సౌకర్యాలతో 100 పడకలతో ప్రత్యేక గదులు ఉన్నాయన్నారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రతిరోజు డాక్టర్లు పర్యవేక్షణ, భోజన సదుపాయం, మంచినీరు, కరెంట్ పోయినప్పుడు జనరేటర్ సదుపాయం, తదితర అన్ని వసతులు కల్పించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లితే మాస్క్ తప్పకుండా ధరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.


Next Story