సింగరేణి సమ్మెలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మోడీకి వార్నింగ్

by  |
gandra-1
X

దిశ, భూపాలపల్లి: కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు నిర్వహిస్తున్న 3 రోజుల సమ్మెకు టీఆర్ఎస్ మద్దుతు తెలిపింది. నేడు సింగరేణి కార్మికులు సమ్మె అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణికి కేటాయించిన నాలుగు బ్లాక్ లను మోడీ ప్రధానమంత్రి కావడానికి ఆర్థికంగా సహాయం చేసిన అధాని, అంబానీలకు కారు చౌకగా ధారాదత్తం చెయ్యాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

వెంటనే ఆ నాలుగు బ్లాక్ ల వేలం పాటను రద్దు చేయాలన్నారు. ఈ సమ్మెలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట సిద్దు రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ ఉపాధ్యక్షులు బుర్ర సదానందం, మండల పార్టీ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్, టౌన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గండ్ర యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed