జవాన్‌ను విడిపించాలంటూ హైవే దిగ్బంధం

by  |
జవాన్‌ను విడిపించాలంటూ హైవే దిగ్బంధం
X

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు అదుపులోకి తీసుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌
విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబీకులు, ఇతరులు డిమాండ్ చేశారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని కొంత మంది జమ్ము అఖ్‌నూర్ హైవేను దిగ్బంధించారు. అనంతరం రాకేశ్వర్ సింగ్ కుటుంబీకులూ ఈ ధర్నాలో పాల్గొన్నారు.

పోలీసులు తప్పిపోయినట్టుగా చెబుతున్న జవాన్ మా దగ్గరే సేఫ్‌గా ఉన్నాడని, అతని విడుదలకు ప్రభుత్వం మధ్యవర్తులను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఓ కరపత్రంలో పేర్కొన్న సంగత తెలిసిందే. హైవే దిగ్బంధం కన్నా ముందు రాకేశ్వర్ సింగ్ భార్య మీను మాట్టాడారు. ఒక వేళ జవాన్ తన సెలవు రోజులు అయిపోయాక ఒక్క రోజు ఆలస్యంగా డ్యూటీలో చేరినా ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాంటప్పుడు రాకేశ్వర్ సింగ్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి మిస్సింగ్‌లో ఉన్నాడని, ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే మధ్యవర్తులను ఏర్పాటుచేయాలని, వారి ద్వారా తన భర్త విడుదల సులువవుతుందని అభ్యర్థించారు. బీజాపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మరణించగా ఒక జవాన్ మిస్ అయిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed