హైదరాబాద్ లోక్ సభ స్థానానికి రీపోలింగ్ జరపాలి: మాధవీలత సంచలన డిమాండ్

by Satheesh |
హైదరాబాద్ లోక్ సభ స్థానానికి రీపోలింగ్ జరపాలి: మాధవీలత సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహాలం ముగిసింది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. 66.03 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా భువనగిరిలో పోలింగ్ శాతం నమోదుగా.. ఎప్పటిలాగే హైదరాబాద్ లోక్ సభ స్థానంలో తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. అయితే, హైదరాబాద్‌లో 48 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అయితే.. అందులో చివరి లాస్ట్ గంటలోనే ఏకంగా 12 శాతం పోలింత్ శాతం నమోదు అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో చివరి గంటలో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరగడంపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఎంఐఎం రిగ్గింగ్‌ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక అధికారుల సాయంతో ఎంఐఎం నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికను రద్దు చేసి.. ఈ స్థానానికి రీపోలింగ్‌ జరపాలని ఆమె సంచలన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి రీపోలింగ్‌ కోసం ఎంతదూరమైనా వెళ్తా వెళ్తానని ఆమె తేల్చిచెప్పారు. కాగా, పోలింగ్ రోజున కూడా మాధవీలత తీరు తీవ్ర వివాదస్పదమైన విషయం తెలిసిందే.

పోలింగ్ రోజు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలింగ్ బూత్‌ల్లో పర్యటించిన మాధవీలత.. రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో ఓ ముస్లిం మహిళను బుర్ఖా తీసి ఆమె ముఖాన్ని ఓటర్ స్లిప్‌లో ఉన్న ఫొటోతో సరిపోల్చి చూశారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో కన్నెర్రజేసిన ఈసీ.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలకు ఆమెపై మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌లో రిగ్గింగ్ జరిగిందని.. రీ పోలింగ్ నిర్వహించాలని మాధవీలత డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె డిమాండ్‌పై ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed