మందుబాబులకు భారీ గుడ్‌న్యూస్.. ఎలుకల రక్తంలోనే భారీ శాతం ఆల్కహాల్! పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు

by Anjali |
మందుబాబులకు భారీ గుడ్‌న్యూస్.. ఎలుకల రక్తంలోనే భారీ శాతం ఆల్కహాల్! పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని మందుసీసాలపై రాసున్నా అవేమీ పట్టించుకోకుండా తాగుతుంటారు. కొంతమంది మద్యం ప్రియులు వీకెండ్ తాగితే మరికొంతమంది వీక్లీ నాలుగైదు సార్లు తాగుతుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుందని ఏ మాత్రం ఆలోచన లేకుండా తేల్లార్లు తాగుతుంటారు. అయితే మితిమీరి మద్యం సేవిస్తే లివర్ ఆరోగ్యం పాడైపోతుందని తరచూ చెప్పే ఆరోగ్య నిపుణులే తాజాగా మద్యం బాబులకు భారీ శుభవార్త అందించారు. ఎంత తాగినా లివర్ కు ఏం జరక్కుండా శాస్త్రవేత్తలు ఒక జెల్ కనిపెట్టారు. ప్రస్తుతం దీనిపై పరిశోధన కూడా ప్రారంభించారు. అయితే ఈ జెల్ ప్రయోగాన్ని ఎలుకల మీద చేస్తున్నారు.

ఈ పరిశోధనలో ముందుగా కొన్ని ఎలుకలకు యాంటీ ఇన్ టాక్సికెంట్ జెల్ ను ఇస్తారు. కొన్ని ఎలుకలకు నానో జెల్ ను ఇచ్చారు. మరికొన్నింటికి మాత్రం జెల్ ఇవ్వలేదు. తర్వాత అన్ని ఎలుకలకు ఒక డోస్ ఆల్కహాల్ తాగిస్తారు. జెల్ ఇవ్వని ఎలుకల రక్తంతో పోలిస్తే, జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలోనే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే జెల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ను తగ్గిస్తుందని వెల్లడైంది. అలాగే జెల్ తీసుకున్న ఎలుకల లివర్ మీద కూడా పెద్ద ప్రభావం కూడా చూపలేదు. కాగా త్వరలోనే ఈ జెల్‌ను మనుషుల మీద కూడా ప్రయోగించనున్నారట. ఈ ప్రయోగం సక్సెస్ అయితే త్వరలోనే మందుబాబుల కోసం ఈ జెల్‌ను మార్కెట్ లోకి తీసుకురానున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మందుబాబులకు జెల్ ఎలా పని చేస్తుందంటే..?

ఈ జెన్ ను స్విజ్జర్లాండ్ లోని జురిచ్ యూనివర్సీటికి చెందిన శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ జెల్‌లో గోల్డ్ నానో పార్టికల్స్, గ్లూకోజ్, వే ప్రోటీన్ నుంచి వచ్చే నానో ఫైబర్స్ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే ముందు నానో ప్రోటీన్స్ తో తయారైన ఈ నానో జెల్ ని తీసుకున్నట్లైతే శరీరంలోని పేగుల లోపల ఒక పొరలా ఏర్పడుతుంది. కాగా ఇది డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. దీంతో ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా అదే సమయంలో ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌‌ను విడుదల చేస్తుంది. ఇది ఆల్కహాల్ ను రక్తం నుంచి లివర్ లో చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ గా ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే దాన్ని మడత పెట్టేస్తుంది. అంటే ఆల్కహాల్ ‌తో హాని చేయని ఎసిటిక్ యాసిడ్ గా మార్చుతుంది. కాగా మందు బ్లడ్ లో కలిసినా లివర్ పై పెద్దగా ప్రభావం చూపదు. ఈ జెల్ వల్ల మిగతా పార్ట్స్ కు కూడా ప్రమాదం జరకకుండా ఉంటుంది. మందుబాబులకు పెద్దగా కిక్ ఎక్కకుండా ఉంటుంది.

Next Story

Most Viewed