పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను తగ్గించాలని కోరిన పెట్రోలియం శాఖ!

by  |
పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను తగ్గించాలని కోరిన పెట్రోలియం శాఖ!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త గరిష్ఠాలను తాకిన నేపథ్యంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే వినతులు పెరిగాయి. కరోనా సమయంలో పన్నులు అధికంగా పెంచినప్పటికీ ప్రజల విమర్శలను ఎదుర్కొని ప్రభుత్వం అధిక సుంకాన్ని అమలు చేసింది. ఇటీవల ఆర్థికవ్యవస్థ సాధారణ స్థాయికి వచ్చేయడం, అన్ని కార్యకలాపాలు సాధారణమైపోవడంతో సుంకాలను తగ్గించాలని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

ప్రభుత్వం ఆదాయం పెరిగిన కారణంగా ఇంధనంపై పెంచిన సుంకాలను తగ్గించాలని లేఖలో పేర్కొంది. తాజాగా, దేశీయంగా ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరలు రూ. 90కి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన వేళ దేశీయంగా అదనపు సుంకాలను విధించారని, వాటిని ఇప్పుడు తగ్గించాలని సూచించింది. కాగా, తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 85.70 ఉండగా, డీజిల్ రూ. 75.88, ముంబైలో పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ. 82.66గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 89.15 ఉండగా, డీజిల్ రూ. 82.80గా ఉంది.

Next Story

Most Viewed