ఎంఎస్ఎంఈ చట్టానికి సవరణలు

by  |
ఎంఎస్ఎంఈ చట్టానికి సవరణలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థలో మాత్రమే కాక చట్టాల్లోనూ కరోనా పెను మార్పులు తీసుకొచ్చింది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ చట్టానికి కూడా సవరణలు చేసింది. దాంట్లో భాగంగా సూక్ష్మ (మైక్రో) పరిశ్రమ ప్రారంభ పెట్టుబడి పరిమితిని కోటి రూపాయలకు, టర్నోవర్‌ను ఐదు కోట్ల రూపాయలకు పెంచుతూ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ కూడా విడుదలైంది. ఇక చిన్న తరహా (స్మాల్) పరిశ్రమల ప్రారంభ పెట్టుబడిని రూ. 10 కోట్లకు, టర్నోవర్‌ను రూ. 20 కోట్లకు పెంచింది. మీడియా (మధ్య తరహా) పరిశ్రమల ప్రారంభ పెట్టుబడి పరిమితిని రూ. 20 కోట్లకు, టర్నోవర్‌ను రూ. 100 కోట్లకు పెంచింది. అయితే మీడియం పరిశ్రమల సంఘం ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ త్వరలో ఈ పరిశ్రమల ప్రారంభ పెట్టుబడి పరిమితిని రూ. 50 కోట్లకు, టర్నోవర్‌ను రూ. 250 కోట్లకు పెంచనుంది. ఇప్పటిదాకా ఉత్పత్తి, సర్వీసు (సేవా) పరిశ్రమలను వేర్వేరు రంగాలుగా గుర్తించగా కొత్తగా ఈ చట్టానికి సవరణలు చేస్తుండడంతో రెండూ ఒకే కేటగిరీగా పరిగణించబడతాయి. ఆత్మనిర్బర్ ప్యాకేజీ గరిష్ట ఫలాలు అందుతాయన్న ఉద్దేశంతో మైక్రో, స్మాల్, మీడియా పరిశ్రమల పెట్టుబడి, టర్నోవర్ అంశాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని మంత్రిత్వశాఖ వివరించింది.



Next Story

Most Viewed