అందరూ రాక్షసులే.. ఏపీ ప్రభుత్వంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం

by  |
Minister vemula Prashant Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్టణంలోని దివిటిప‌ల్లిలో నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దోపిడీని అడ్డుకొని తీరుతామ‌ని స్పష్టం చేశారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టును ఏపీ కొన‌సాగిస్తే.. తెలంగాణ ప్రజ‌లు మ‌రో యుద్ధానికి సిద్ధం కావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఊరుకోరు అని అన్నారు. అంతేగాకుండా.. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షాసులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లు ఏనాడూ తెలంగాణ ప్రజల మేలు కోరుకోరు అని తెలిపారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సీఎం వైస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు నుండి 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారని, పోతిరెడ్డిపాడు జల దోపిడీపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేస్తే అప్పటి కాంగ్రెస్ మంత్రి డీకే అరుణ వైయస్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నప్పుడు హారతులు పట్టారు అని మండిపడ్డారు. వైఎస్ నీటి దొంగ అయితే ఆయన కొడుకు గజదొంగ అని విమ‌ర్శించారు. దొంగ‌త‌నంగా ప్రాజెక్టులు క‌డుతున్నార‌ని, రాయ‌ల‌సీమ‌, ఆర్డీఎస్ కుడి కాల్వ ప‌నుల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో ప్రజాయుద్ధం జ‌రుగుతుంద‌ని హెచ్చరించారు.



Next Story

Most Viewed