పశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి తలసాని

by  |
పశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని, జీవాలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బుధవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడారు. గ్రామాల్లోని జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలను అందించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య శాలలను 2017లోనే ప్రారంభించామని, ఒక్కో వాహనంలో వైద్యుడు, ఒక పారా సిబ్బంది, హెల్పర్ ఉంటారని వివరించారు. ఇందుకు నెలకు రూ. 2కోట్లను వెచ్చించామని, జీవాలకు ఉత్తమమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడమన్నారు. ప్రతి జిల్లా పశువైద్యాదికారి పరిధిలో ఒక కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసి సంచార పశువైద్యశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను మంత్రి ఆదేశించారు.

కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫోన్‌కాల్‌కు స్పందించి జీవాలకు వైద్యసేవలు అందించాలని, ప్రస్తుతం ప్రతిరోజు సుమారు ఒక్కో వాహనం ద్వారా 19జీవాలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే 1962 సేవలు అందుతున్నాయని, ఈ సేవలను ప్రతిరోజూ రెండు విడతలుగా ఉదయం 7 నుండి మధ్యాహం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్యశాలలు పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



Next Story

Most Viewed