ప్రజలకు అందుబాటులో ఉండండి..

by  |
ప్రజలకు అందుబాటులో ఉండండి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా సూపరింటెండెంట్, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం ఇబ్బందులు, ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం, సీఎస్ సూచించిన విధంగా, జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని మంత్రి అన్నారు. బాగా వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో పాత ఇండ్లు పడిపోయే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు బాగా కురిసినందున వరదలు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు.

Next Story

Most Viewed