మరో ఆరు రోజుల్లో కరోనా ఫ్రీ జిల్లాగా మహబూబ్ నగర్

by  |
మరో ఆరు రోజుల్లో కరోనా ఫ్రీ జిల్లాగా మహబూబ్ నగర్
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రమంగా కరోనా బారి నుంచి బయట పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికే నారాయణ పేట్ జిల్లా కరోనా ఫ్రీగా మారగా, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా గ్రీన్‌జోన్‌‌లోకి వచ్చిందన్నారు. మరో ఆరు రోజులు ఎదురుచూస్తే మహబూబ్ నగర్ కూడా కరోనా ఫ్రీ జిల్లాగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ కరోనా ఫ్రీ జిల్లాగా మార్పు చెందినా ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను విధిగా పాటించాల్సిందేనని ప్రజలకు సూచించారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారు బయట తిరగరాదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే పట్టుకుని ఆస్పత్రికి తరలిస్తామన్నారు. రాష్ట్రంలో నెల రోజుల చిన్నారికి కరోనా సోకగా వైద్యుల ట్రీట్ మెంట్ వల్ల పూర్తిగా కోలుకుందన్నారు. జిల్లా వాసులతోపాటు మిగతా రాష్ట్రాల వారికి కూడా రెండ్రోజులుగా కొన్నిరంగాల్లో పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న మన వారికి ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి కనీస వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ముంబైలో చిక్కుకున్న కోయిలకొండ గిరిజనులకు తక్షణ సాయం అందించామని, ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి తెస్తే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

tags : corona free district, mahabubnagar, minister srinivas goud, expecting

Next Story

Most Viewed