రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి

by  |
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి
X

దిశ, వరంగల్: రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలస కూలీలకు రవాణా సౌకర్యాలు కల్పించి పంపించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ వలస కూలీలను తరలించడంలో కేంద్రం సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ బాధ్యత వదిలేయడం సరికాదన్నారు. లాక్‌డౌన్ విధించక ముందే వలస కూలీలను తరలిస్తే బాగుండేదన్నారు. ప్రస్తుతం ఇక్కడే పనిచేసుకుంటామన్న వారిని కాకుండా, సొంతూర్లకు వెళ్తామన్న వారికి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో కురవిలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

tags: farmers, if any miller cheat, action against them, minister satyavathi rathod, lockdown

Next Story

Most Viewed