గ్రంథాలయ నిర్మాణానికి మంత్రి సబిత శంకుస్థాపన..

by  |
గ్రంథాలయ నిర్మాణానికి మంత్రి సబిత శంకుస్థాపన..
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లు గురువారం శంకుస్థాపన చేశారు. 1.88కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రేడ్ 1 గ్రంథాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, షాద్ నగర్ గ్రంథాలయ అధ్యక్షుడు పి.లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story