పైసా ఖర్చులేకుండా పేదలకు ‘డబుల్’ ఇండ్లు

by  |
పైసా ఖర్చులేకుండా పేదలకు ‘డబుల్’ ఇండ్లు
X

దిశ‌, కొత్త‌గూడెం: పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతో, పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులురుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03 కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇండ్లు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 ఇండ్లు, రామచంద్రపురం గ్రామంలో రూ.3.27 కోట్లతో 65 ఇండ్లు, ఎలకలొడ్డు గ్రామంలో రూ.1.76కోట్లుతో 35 ఇండ్లు, మొత్తం రూ.12.32 కోట్లతో నిర్మించిన 225 ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

పేదలకు కేటాయించిన ఇండ్లు ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైనవి తెలిపారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ప్రజల సమక్షంలోనే నిజమైన లబ్దిదారులుగా ఎంపిక చేశామని తెలిపారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు ఇండ్లు కేటాయించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 500కు పైగా ఇండ్లను పంపిణీ చేశామన్నారు. కేటాయింపులో నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed