రెడీగా ఉన్నాం.. ఓకే అంటే రోడ్డెక్కేస్తాయి

by  |
రెడీగా ఉన్నాం.. ఓకే అంటే రోడ్డెక్కేస్తాయి
X

లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాల్గో దశ లాక్‌డౌన్‌లో ఆర్టీసీ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీలో బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం జగన్ ఓకే అంటే బస్సులు రోడ్డెక్కేస్తాయని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ పరిపాలన భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కండక్టర్లు లేకుండానే బస్సులు నడిపే ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం వస్తే ప్రయోగాత్మకంగా కొన్ని సర్వీసులు నడిపి, క్రమంగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ చార్జీలు పెంచబోమని, నష్టమైనా భరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం నుంచి స్పష్టత వస్తే 24 గంటల్లో ఆర్టీసీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి పేర్ని నాని వివరించారు.

Next Story

Most Viewed