రైతుల తలరాత మార్చేది ఆ ‘వేదిక’లే: మంత్రి నిరంజన్‌రెడ్డి

by  |
రైతుల తలరాత మార్చేది ఆ ‘వేదిక’లే: మంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల తలరాతలు మార్చే వేదికలు రైతు వేదికలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వ్యవసాయంపై పట్టు రావాలంటే ప్రతి అంగుళంలో ఏం జరుగుతుందనే విషయం రైతు వేదికల ద్వారా తెలుస్తుందని చెప్పారు. అందుకే ప్రతి ఐదువేల ఎకరాలకూ ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండేలా ఏఈఓలను నియమించామని తెలిపారు. రాష్ట్రంలో 2,601 రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 2,556 రైతు వేదికలను పూర్తి చేశామని చెప్పారు. దాతలు స్వయంగా 22 రైతు వేదికలను నిర్మించగా, మంత్రులు కేటీఆర్ ఆరు, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు తాను స్వయంగా రెండు రైతు వేదిలను నిర్మించామని తెలిపారు. ఈ వేదికల్లో రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వేదికల నిర్వహణకు నెలకు రూ.8 వేలు కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కందులు, వేరుశనగ, పత్తి, మిర్చి పరిశోధనలకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. నర్సంపేటలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు విషయం పరిశీలనలో ఉందని తెలిపారు.

Next Story

Most Viewed