‘విశాఖలో ఆ సెంటర్ ఏర్పాటు చేస్తాం’

by  |
‘విశాఖలో ఆ సెంటర్ ఏర్పాటు చేస్తాం’
X

దిశ, ఏపీబ్యూరో: విశాఖలో సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్ ​ఏర్పాటుకు బీహెచ్​ఈఎల్​తో ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్​ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటునకు బీహెచ్ఈఎల్‌తో అవగాహన కుదిరింది.

దీంతో పాఠశాల విద్య పూర్తయిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా సర్టిఫికేషన్ చేయనున్నాయి. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఓ కేంద్ర బృందం, నోడల్ అధికారి నియామకానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది. మంత్రి మేకపాటి ప్రతిపాదనల మేరకు ఐటీఐ కాలేజీలకు తోడ్పాటుతోపాటు నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమందిస్తామని బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ హామీ ఇచ్చారు.

ఇక బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రపెన్యూర్​ కార్యక్రమాన్ని నిర్వహించేందుకూ ఏపీ ప్రభుత్వం, బీహెచ్‌ఈఎల్ మధ్య అంగీకారం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జిల్లాకు ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటునకు సంబంధించి మంత్రి హర్షం ప్రకటించారు.



Next Story

Most Viewed